బాత్ టబ్ లో బ్యాక్

Amala Paul shows off glam pics
Friday, November 8, 2019 - 17:30

సినిమాల తర్వాత అమలాపాల్ కు బాగా ఇష్టమైన అంశం ట్రావెలింగ్. తను సంపాదించిన డబ్బులో దాదాపు 40శాతం ట్రావెలింగ్ కు ఖర్చు పెడతానని గతంలోనే ప్రకటించింది అమలాపాల్. అలా చెప్పినట్టుగానే గ్యాప్ దొరికితే చాలు ఏదో ఒక దేశానికి చెక్కేస్తుంది. ప్రస్తుతం ఇండొనేషియాలోని బాలిలో ఉన్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు తన స్టిల్స్ సోషల్  మీడియాలో పెడుతూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది.

ఇందులో భాగంగా రీసెంట్ గా అమలాపాల్  పెట్టిన రెండు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఓ అందమైన బాత్ టబ్, తొట్టె నిండా సుగంధాలు వెదజల్లే పూలు, అందులో నగ్నంగా అమలాపాల్. కేవలం తన వీపు మాత్రమే నగ్నంగా కనిపించేలా ఫొటోలు దిగింది ఈ భామ. వీపుపై ఉన్న టాటూను ఇన్నాళ్లకు బయటపెట్టింది. టబ్ లో ఉంటూ బయట నుంచి పారే వాగును చూస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ.

ఆమె ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. కుర్రకారు అమలాపాల్ బ్యాక్ ను చూసి ఎంజాయ్ చేస్తోంది. ఈ సీన్ కు సంబంధించి మరిన్ని ఫొటోలు కావాలంటూ కొంతమంది డిమాండ్ చేస్తుంటే.. ఫ్రంట్ కు కూడా తిరిగితే బాగుండేదంటూ మరికొందరు కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు.

ఇలా నగ్నంగా కనిపించడం అమలాపాల్ కు కొత్తకాదు. గతంలో కొన్ని స్టిల్స్ రిలీజ్ చేసింది. తాజాగా రిలీజైన ఆమె అనే సినిమాలో కూడా పూర్తిగా నగ్నంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా మాత్రం ఫ్లాప్ అయిందనుకోండి. అది వేరే విషయం.