అమల లవర్ ఫోటోలు వైరల్

Amala Paul's new lover, pics go viral on the internet
Wednesday, March 11, 2020 - 17:45

"నన్ను వివాదాల్లోకి లాగకండి, నాకు లైఫ్ లో ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు," అని అమల పాల్ మొన్నామధ్య మీడియాని వేడుకొంది. ఆమె మాజీ భర్త విజయ్ తండ్రి చేసిన ఒక కామెంట్ వల్ల రేగిన వివాదం అది. "ధనుష్ వల్లే మా వాడు (దర్శకుడు విజయ్), అమల విడిపోవాల్సి వచ్చింది. వాళ్ళ కాపురంలో నిప్పులు పోశాడు ధనుష్," అని విజయ్ తండ్రి మొన్న కామెంట్ చేశారు. దాంతో దానికి రకరకాల అర్థాలు తీస్తూ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. 

ఆ టైంలోనే అమల తన లవ్ మ్యాటర్ ని బయట పెట్టింది. ఇప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ ఫోటోలు లీక్ అయ్యాయి. ముంబై కి చెందిన ఒక సింగర్ తో ఆమె ప్రేమలో పండింది. భావిందర్ సింగ్ అనే ఒక ముస్లిం సింగర్ తో ఆమె సహజీవనం సాగిస్తోంది అనేది టాక్. వీళ్లద్దరూ క్లోజ్ గా కలిసి ఉన్న ఫోటోలు బయటకి వచ్చాయి. ఐతే, అతనితో ఉన్నప్పుడు అమల బుర్కాలో ఉండడంతో కామెంట్లు ఘాటుగా పడుతున్నాయి. 

అమల పాల్ ...కేరళకి చెందిన క్రిస్టియన్. కొన్నేళ్ల క్రితం హిందూ మతంలోకి మారింది. ఇప్పుడు ముస్లిం సింగర్తో ప్రేమలో ఉంది.