మొత్తానికి మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్ మొద‌లైంది

AMB Cinemas inaugurated
Sunday, December 2, 2018 - 16:00

మ‌హేష్‌బాబు మ‌ల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయ‌న నిర్మించిన మ‌ల్టీప్లెక్స్ ప్రారంభోత్స‌వం అనేక‌సార్లు వాయిదాప‌డింది. ఫైన‌ల్‌గా ఆదివారం లాంఛ‌నంగా లాంచ్ అయింది. మ‌హేష్‌బాబు తండ్రి, సూప‌ర్‌స్టార్ కృష్ణ గ‌చ్చిబౌలిలోని ఎ.ఎం.బి సినిమాస్ మ‌ల్టీప్లెక్స్‌ని ప్రారంభించారు. 

రోబోకి సీక్వెల్‌గా రూపొందిన టూ పాయింట్ ఓని ప్రారంభ చిత్రంగా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా విడుద‌లైంది. అయితే త‌మ మ‌ల్టీప్లెక్స్‌లో ఆ సినిమాని చూస్తే ఆ అనుభూతే వేరంటున్నాడు మ‌హేష్‌బాబు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఉన్న అన్ని మ‌ల్టీప్లెక్స్‌ల‌లో క‌న్నా ఇదే బెస్ట్ అని చెపుతున్నారు. మంచి అభిరుచితో ఇంటిరియ‌ర్స్‌, సీటింగ్స్ అరెంజ్‌మెంట్స్ చేశార‌ట‌. 

టెక్నాల‌జీ కూడా లేటెస్ట్‌గా ఉంది. మొత్త‌మ్మీద మ‌హేష్‌బాబు నిర్మించిన ఈ మ‌ల్టీప్లెక్స్ రానున్న రోజుల్లో మెయిన్ అడ్డా కానుంది సినిమా ల‌వ‌ర్స్‌కి.