పెళ్లి కాకుండానే త‌ల్లి అవుతోంది

Amy expecting first child
Sunday, March 31, 2019 - 22:45

అమీ జాక్స‌న్ మొద‌టి నుంచి డేరింగ్ హీరోయిన్ అనే చెప్పాలి. అందాల ఆర‌బోత‌లో ఆమె ఎంత డేర్ చూపించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాగే ఇటీవ‌లే ఎంగేజ్‌మెంట్‌ని ఆఫ్రికాలో చేసుకొని...దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. జ‌న‌వ‌రి 1న వీరి ఎంగేజ్మెంట్ జ‌రిగింది. మార్చి 31న ఆమె తాను త‌ల్లి కాబోతున్న‌ట్లు వార్త‌ని షేర్ చేసింది.

అవును..ఎంగేజ్‌మెంట్ అయిన‌ప్ప‌టికీ ఇంకా పెళ్లి కాలేదు. కానీ అపుడే ఆమె తల్లి కాబోతోంది. బ్రిట‌న్‌లో ఈ రోజు మ‌ద‌ర్స్ డేన‌ట‌. అందుకే ఈ రోజు తాను త‌ల్లి కాబోతున్న విష‌యాన్ని ప్ర‌పంచానికి షేర్ చేసింది. పుట్టింది, పెరిగింది బ్రిట‌న్‌లోనే. ఐతే హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న‌ది మాత్రం ఇండియాలోనే.

తెలుగులో ఎవ‌డు సినిమాలో న‌టించిన ఈ బ్యూటీ ...రీసెంట్‌గా శంక‌ర్ తీసిన 2.0 సినిమాలో క‌నిపించింది. హాలీవుడ్ హీరోయిన్లు ఎక్కువ‌గా గ‌ర్భ‌వ‌తిగా మారాకే పెళ్లి చేసుకుంటుంటారు. వారి బాట‌లోనే అమీ వెళ్తోంది.