గ‌ర్భ‌వ‌తి అమీ జాక్స‌న్ ఫ్యాష‌న్ షో

Amy Jackson flaunts baby bump
Tuesday, April 30, 2019 - 20:15

అమీ జాక్స‌న్ పాపుల‌ర్ న‌టి. అలాగే ఆమె ఫేమ‌స్ మోడ‌ల్‌. ఫ్యాష‌న్ మేగ‌జైన్స్‌కి రెగ్యుల‌ర్‌గా ఫోజులు ఇస్తుంటుంది. ర్యాంప్‌పై క్యాట్‌వాక్ సోయ‌గాల‌తో రెచ్చిపోతుంటుంది. ఆమె ఇపుడు గ‌ర్భ‌వ‌తి. గ‌ర్భం దాల్చిన త‌ర్వాత కూడా ఫ్యాష‌న్ షోల‌కి అటెండ్ కావ‌డం మాన‌లేదు.

అక్టోబ‌ర్‌లో ఆమెకి డెలీవ‌రీ డేట్ ఇచ్చారు డాక్ట‌ర్లు. ఈ భామ బేబీ బంప్‌తోనే ఇటీవ‌ల ఒక ఫ్యాష‌న్ షో వ‌ద్ద ద‌ర్శ‌న‌మిచ్చింది. ఆ బంప్ క‌న‌బ‌డేలా అందంగా డ్రెస్సు వేసుకొని కెమెరాకి ఫోజు ఇచ్చింది. ఆ ఫోటోని త‌నే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

బాయ్‌ఫ్రెండ్ జార్జితో ఆమె స‌హ‌జీవ‌నం చేస్తోంది. అత‌నే ఆమె పుట్ట‌బోయే పిల్ల‌ల‌కి తండ్రి. ఇప్ప‌టికే ఇద్ద‌రూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అమీ జాక్స‌న్ తెలుగులో 'ఎవ‌డు'  చిత్రంలో న‌టించింది. అలాగే 'ఐ మ‌నోహ‌రుడు', 'టూ పాయింట్ ఓ' అనువాద చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచిత‌మే.