14న అనగనగా ఓ ప్రేమకథ

Anaganga O Prema Katha confirmed for Dec 14
Saturday, December 1, 2018 - 17:30

నిర్మాత కె.ఎల్‌.ఎన్‌.రాజు నిర్మించిన‌ 'అనగనగా ఓ ప్రేమకథ  డిసెంబర్‌ 14న విడుదల కానుంది. ప్ర‌ముఖ ఎడిట‌ర్ మార్తాండ్ వెంక‌టేష్ మేన‌ల్లుడు విరాజ్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. దిల్‌రాజు నిర్మించిన ల‌వ‌ర్ సినిమాతో ప‌రిచ‌య‌మైన రిద్దీ  ఈ సినిమాలో హీరోయిన్‌.

"సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్‌ యు సర్టిఫికేట్‌ పొందింది. డిసెంబర్‌ 14న సినిమాను విడుదల చేస్తున్నాం. క్లీన్‌ లవ్‌స్టోరీ. మంచి సస్పెన్స్‌ కూడా ఉంటుంది. సినిమా చూసినవారు అప్రిషియేట్‌ చేస్తున్నారు. హీరో విరాజ్‌, హీరోయిన్స్‌ రిద్దికుమార్‌, రాధా బంగారు సహా కాశీవిశ్వనాథ్‌ ఇతర నటీనటులు అందరూ చక్కగా నటించారు," అని చెప్పారు నిర్మాత కె.ఎల్‌.ఎన్‌.రాజు.