నోటా దర్శకుడు కూడా ఓ ఇంటివాడయ్యాడు

Anand Shankar gets married
Friday, July 12, 2019 - 22:15

నిన్ననే దర్శకుడు ఏఎల్ విజయ్ పెళ్లి చేసుకున్నాడు. అమలాపాల్ నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్న తర్వాత ఐశ్వర్య అనే డాక్టర్ ను పెళ్లాడాడు. ఈరోజు మరో దర్శకుడు కూడా వైవాహిక జీవితంలోకి ప్రవేశించాడు. అతడి పేరు ఆనంద్ శంకర్. 

నోటా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఆనంద్ శంకర్. ఆ సినిమా టైమ్ కే దివ్యాంక జీవనాంతమ్ తో డేటింగ్ లో ఉన్నాడు. నోటా రిలీజ్ అయిన వెంటనే దివ్యాంకతో తనకున్న బంధాన్ని బయటపెట్టిన ఈ దర్శకుడు.. అదే టైమ్ లో ఎంగేజ్ మెంట్ అయిన విషయాన్ని కూడా సోషల్ మీడియాలో ప్రకటించాడు.

ఇలా కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఆనంద్ శంకర్, దివ్యాంక ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. తామిద్దరం వైవాహిక బంధంతో ఒక్కటైనట్టు ఆనంద్ శంకర్ ప్రకటించాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు ఎలాంటి సినిమాకు కమిట్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే నోటా తర్వాత పూర్తిగా ఫ్రీగా ఉన్నాడు. కొన్నాళ్లు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసి, ఆ తర్వాత కొత్త ప్రాజెక్టుతో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడు ఆనంద్ శంకర్.