రంగమ్మ‌త్త‌కి మెగా ఆఫ‌ర్‌

Anasjya to act in Chiranjeevi Koratala's film
Saturday, June 8, 2019 - 15:15

న‌టిగా అన‌సూయకి ఫేమ్‌ని తెచ్చిపెట్టిన చిత్రం....రంగ‌స్థ‌లం. రంగ‌మ్మ‌త్త పాత్రతో ఆమె ఎంతో క్రేజ్ తెచ్చుకొంది. రామ్‌చ‌ర‌ణ్‌కి అత్త వ‌రుస‌య్యే పాత్ర‌లో న‌టించింది. ఇపుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో న‌టించే చాన్స్ కొట్టేసింది అన‌స‌యూ.

చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందే కొత్త సినిమాలో కీ రోల్ అన‌సూయ‌కి ద‌క్కింద‌ట‌.

చిరంజీవి న‌టిస్తున్న సైరా సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌లో ఉంది. వ‌చ్చేవారంలో సినిమాకి గుమ్మ‌డికాయ కొడుతార‌ట‌. దాంతో చిరంజీవి ఇక కొర‌టాల శివ సినిమాపై ఫోక‌స్ పెడుతారు. వ‌చ్చే నెల‌లో సినిమాని లాంఛ‌నంగా లాంచ్ చేసి...ఆగ‌స్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తార‌ట‌. హీరోయిన్ రోల్ కోసం ఒక పెద్ద హీరోయిన్‌ని సంప్ర‌దించారు. ఇక కీల‌క‌మైన ఒక పాత్ర‌లో అన‌సూయ‌ని తీసుకున్నార‌ట‌