అనసూయకి తిట్ల ట్వీట్ల దండకం

Anasuya gets trolled over lockdown tweet
Monday, March 23, 2020 - 11:15

ఈ నెల 31 వరకు తెలంగాణ లాక్ డౌన్ అని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించగానే అనసూయ ఒక ట్వీట్ చేసింది. కొందరికి మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఆ కొందరు ఎవరు అంటే.. పని చేస్తే గాని రెంట్లు కట్టలేని, ఈ.ఎం.ఐలు చెల్లించలేని తన లాంటి వారు అనే అర్థంలో ట్వీటింది ఈ భామ. అంతే ఆమెని ఓ రేంజులో ఆడుకున్నారు ఆమె ఫాలోవర్స్.

"మనుషులు చచ్చిపోతుంటే... నీకు మినహాయింపులు కావలా? ఏమి మాట్లాడ్తున్నావో అర్థం అవుతోందా? అయినా పది రోజులు బంద్ పెడితే... రెంట్ కట్టలేని పరిస్థితి లో ఉన్నావా? లేదంటే తెల్ల కార్డు పట్టుకొని రేషన్ షాప్ కి పో సరుకులు ఇస్తారు," అని గట్టిగా వాయించారు. ఎన్నో బూతులతో ఉన్న తిట్ల ట్వీట్ లలో ఇది కాస్త సంస్కారమైనది. ఇక మిగతావి ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 

ఇక్కడ క్లిక్ చెయ్యండి: అనసూయ కొత్త ఫోటోలు

అప్పటినుంచి రాత్రంతా అందరికి రిప్లై ఇస్తూ కూర్చొంది అనసూయ. అసలు తన ఉద్దేశం అది కాదు అని చెప్పింది. కొన్ని దేశాల్లో ... ఈ కరోనా వల్ల  ఈ.ఎం.ఐలు వాయిదా వేశారు. అలంటి ఉపశమన చర్యలు మన వద్ద తీసుకోవాలని నేను కోరాను. నేను "మన" అందరి కోసం అడిగాను అంటూ వివరణ ఇచ్చింది. 

అయినా ఎవరు తిట్ల ట్వీట్ల దండకం ఆపలేదు. దాంతో ఈ రోజు మార్కింగ్ (సోమవారం) లేవగానే ఇలా పోస్ట్ చేసింది - "నిన్నటి నుంచి ట్విట్టర్ లో, ఇన్ స్టాలో వెధవ అకౌంట్ లు బ్లాక్ చేసి చేసి వేళ్ళు నొప్పేస్తున్నాయంటే నమ్మండి. నా పేజీ లో వాళ్ళ బుర్ర లేనితనం ఏంటి.. నా మనశ్శాంతి నాకు ముఖ్యం."