అనసూయ ఇప్పుడేమంటుందో!

Anasuya lies are exposed
Thursday, December 26, 2019 - 10:45

సినీప్రముఖల ఇళ్లపై 3 రోజుల కిందట వరుసగా దాడులు జరిగాయి. కేవలం స్టార్ హీరోహీరోయిన్లు మాత్రమే కాకుండా, ఓ మోస్తరు క్రేజ్ ఉన్న నటీనటుల ఇళ్లపై కూడా జీఎస్టీ దాడులు జరిగాయి. ఆ టైమ్ లో అనసూయ, సుమ లాంటి ప్రముఖుల పేర్లు కూడా బయటకొట్టాయి. అయితే అప్పట్లో ఆ వార్తల్ని అనసూయ ఖండించింది. తన ఇంటిపై ఎలాంటి రైడ్స్ జరగలేదని చెప్పుకొచ్చింది. ఆ సందర్భంగా మీడియాకు పెద్ద క్లాస్ కూడా పీకింది.

కట్ చేస్తే, 55 లక్షల రూపాయలు జీఎస్టీ కింద కట్టమని అనసూయకు అధికారులు నోటీసులు జారీ చేశారు. సర్వీస్ టాక్స్ కింద అనసూయ పెద్ద మొత్తంలో పన్ను ఎగవేసినట్టు అధికారులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన సోదాల ప్రకారం నోటీసులు జారీచేసినట్టు చెబుతున్నారు. ఈ మేరకు అనసూయతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలకు నోటీసులు వెళ్లినట్టు తెలుస్తోంది.

సర్వీస్ టాక్స్ కింద 80 లక్షలు కట్టాల్సి ఉండగా, అనసూయ కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించిందట. మిగతా మొత్తాన్ని కట్టాల్సిందిగా తనిఖీల అనంతరం జీఎస్టీ అధికారులు నోటీసులిచ్చాడు. ఈమేరకు హీరోయిన్ లావణ్య త్రిపాఠికి కూడా నోటీసులు అందినట్టు తెలుస్తోంది.