ఆ పాత్ర కాదు నాది: అన‌సూయ‌

Anasuya talks about Vijay Deverakonda's maiden production
Thursday, January 31, 2019 (All day)

విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మిస్తున్న తొలి సినిమాలో అన‌సూయ ఒక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. "ఈ న‌గ‌రానికి ఏమైంది" సినిమాలో ఒక హీరోగా న‌టించిన ఒక న‌టుడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు ఈ సినిమా ద్వారా. ఈ మూవీలో క‌థానాయకుడిగా "పెళ్లిచూపులు" సినిమా ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ న‌టిస్తున్నాడు. దాంతో త‌రుణ్ భాస్క‌ర్ స‌ర‌స‌న అన‌సూయ న‌టిస్తోంద‌ని భావించారు.

ఈ విష‌యంలో అన‌సూయ తాజ‌గా వివ‌ర‌ణ ఇచ్చింది. ఆమె ప్ర‌స్తుతం "క‌థ‌నం" అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన సంద‌ర్భంగా సెట్‌లో మీడియాతో మాట్లాడింది. విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మిస్తున్న మూవీ గురించి కూడా వివ‌ర‌ణ ఇచ్చింది. త‌రుణ్ భాస్క‌ర్, నేను, మ‌రో యువ జంట ఈ సినిమాలో న‌టిస్తున్నాం. ఐతే నేను త‌రుణ్ భాస్కర్‌కి జంట‌గా నటించ‌డం లేదు. నాది కీల‌క‌మైన పాత్రే, అని చెప్పుకొచ్చింది.

"రంగ‌స్థ‌లం" సినిమాలో రంగమ్మ‌త్త‌గా అద‌రగొట్టిన అన‌సూయకి ఇపుడు మంచి క్రేజుంది.