తొమ్మిది తీసుకుంటున్న అనిల్

Anil Ravipudi takes Rs 9cr remuneration
Friday, March 15, 2019 - 18:00

ఒక భారీ హిట్ పడితే చాలు ఒక దర్శకుడి రేంజ్ మొత్తం మారిపోతుందనడానికి "ఎఫ్ 2" సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. "ఎఫ్ 2" సినిమాకి దర్శకుడు..అనిల్ రావిపూడి. సుప్రీం, పటాస్, రాజా ది గ్రేట్ సినిమాల తర్వాత అనిల్ రావిపూడి తీసిన సినిమా... "ఎఫ్ 2". వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా 80 కోట్ల రూపాయల వసూళ్లను అందుకొంది. ఇంత పెద్ద హిట్ ఇవ్వడం వల్లే అనిల్ రావిపూడికి వెంటనే ఛాన్స్ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

జూన్ నుంచి మహేష్‌బాబు - అనిల్ రావిపూడి సినిమా మొదలుకానుంది. ఐతే ఈ సినిమాకి అనిల్ రావిపూడికి ఏకంగా 9 కోట్ల రూపాయల పారితోషికం అందనుందట.

ప్రస్తుతం అనిల్.. పారితోషికం పరంగా అగ్రదర్శకుల జాబితాలో చేరినట్లే. మహేష్ బాబు సినిమా కూడా భారీ విజయ సాధిస్తే అనిల్ కి ఇక తిరుగుండదు. లేదంటే ఫేట్ వన్ బై టూ ఎఫ్ అవుతుంది. తన విజయ పరంపర కొనసాగించేందుకు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ పైన చాలా కసరత్తు చేస్తున్నాట్ట. ఇపుడు అదే పనిలో ఉన్నాడు.