త్రీడీ సినిమాలో సీతమ్మ

Anjali acts in a 3D horror thriller
Thursday, November 8, 2018 - 18:30

పేరుకు తెలుగమ్మాయే. కానీ తమిళ్ లో అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. తర్వాత తెలుగులో కూడా మెరిసింది. కానీ ఇప్పుడు రెండు భాషలకు దూరమైంది. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో అంజలి హవా తగ్గింది. ఇలాంటి టైమ్ లో ఆమె చెంతకు ఓ త్రీడీ సినిమా వచ్చింది. అది కూడా హారర్ సబ్జెక్ట్. అవును.. అంజలి నటించిన హారర్ త్రీడీ సినిమా లీసా. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది.

దాదాపు వంద రోజులు త్రీడీ లో షూట్ చేశారు. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హారర్ సినిమాలు అంజలికి కొత్తకాదు. గీతాంజలి సినిమా తెలుగులో ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు లీసా సినిమా తనకు గుర్తింపు తెస్తుందని ఆశపడుతోంది అంజలి.

సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాతో తెలుగులో సీతగా పాపులర్ అయింది అంజలి. ఆ తర్వాత కొన్ని స్ట్రయిట్ సినిమాల్లో నటించినప్పటికీ యంగ్ హీరోస్ సరసన సెట్ అవ్వలేకపోయింది. సేమ్ టైం, అటు తమిళ సినిమాలకు కూడా దూరమైంది. అలా స్ట్రగుల్ అవుతున్న టైమ్ లో లీసా సినిమా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా కోసం సీతమ్మ స్లిమ్ అయింది కూడా.