ఐ.టి. నుంచి దర్శకత్వం వైపు

Another director from IT
Wednesday, November 6, 2019 - 07:00

శేఖర్ కమ్ముల, గౌతమ్ తిన్ననూరి ఇలా  ఐ.టి. నుంచి వచ్చి డైరెక్టర్స్ గా నిలబడ్డారు.  అనిల్ పంగులూరి' అనే కొత్త దర్శకుడు ఇదే కోవలో తన లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు.  తెలుగుదనం ఉట్టి పడే పేరును ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు. త్వరలోనే పేరు అనౌన్స్ చేస్తారట. " గుండెల్ని మెలిపెట్టే గాఢమైన అనుభూతుల్ని పంచి.. పలు రకాల భావోద్వేగాలతో మనసుల్ని రంజింపచేసి.. చాలా రోజుల తరువాత మళ్ళీ మరో మంచి సినిమా చూశామనే సంతృప్తిని మిగిల్చే చిత్రాన్ని అందించనున్నామనే నమ్మకం, గర్వం మాకుంద,"ని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

దాదాపుగా అందరూ కొత్తవాళ్ళతో రూపొందుతోంది ఈ మూవీ.