ఆస్ట్రియాలో అనుష్క తిప్ప‌లు

Anushka Shetty in Austria to loss weight
Tuesday, October 9, 2018 - 13:00

అనుష్కకి ఇపుడున్న ఏకైక స‌మ‌స్య‌...బ‌రువు. పాపం ఆమె చాలా కాలంగా బ‌రువు త‌గ్గేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఎన్ని ప‌ద్ద‌తుల్లో ట్రై చేసినా పెద్ద‌గా మార్పు రాలేదు. ఆమె వ‌య‌సు ఒక కార‌ణం. అందుకే ఇపుడు ఆమె ఆస్ట్రియా వెళ్లింద‌ట‌. ఒక ఆంగ్ల దిన‌ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం.. అనుష్క ఇపుడు ఆస్ట్రియాలో మకాం వేసింద‌ట‌. 

అక్క‌డ ఒక వైద్యుడు స‌హ‌జ ప‌ద్ద‌తుల్లో బ‌రువు త‌గ్గిస్తాడ‌ట‌. బాలీవుడ్ భామ ప‌రిణితి చోప్రా ఇంత‌కుముందు బొద్దుగా ఉండేది. ఇపుడు సైజ్‌జీరోకి వ‌చ్చింది. దానికి కార‌ణం.. ఆస్ట్రియా వైద్య‌మేన‌ట‌. ఆ స్పూర్తితో అనుష్క కూడా అక్క‌డికి వెళ్లింద‌ట‌. 

మ‌రీ స్వీటీ కూడా సైజ్ జీరోలో క‌నిపించ‌నుందా అనేది చూడాలి. ఇంత‌కీ ఆమెకి ఈ బ‌రువు స‌మ‌స్య ఎలా వ‌చ్చిందో తెలుసా? "సైజ్ జీరో" అనే సినిమాలో న‌టించేందుకు లావుగా మారాల‌ని ప్ర‌య‌త్నించింది. సినిమాలో పాత్ర కోసం చేసిన ప్ర‌య‌త్నం ఆమెకి గుదిబండ‌గా మారింది. "బాహుబ‌లి 2" సినిమాలో ఆమెని స్లిమ్‌గా చూపించేందుకు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గ్రాఫిక్స్ టెక్నాల‌జీ వాడాడు. థ‌ర్టీ ఫైవ్ ప్ల‌స్ ఏజ్‌లో ఆడ‌వాళ్లు బ‌రువు త‌గ్గ‌డం అంటే కొంత క‌ష్ట‌మే. అనుష్క ఇండియాలో చేసిన ప్ర‌య‌త్నాల వ‌ల్ల హార్మోన‌ల్ స‌మ‌స్య‌లు ఏర్ప‌డ్డాయ‌ట‌. దాంతో కొన్నాళ్లూ ఆ ప్ర‌య‌త్నం మానేసింది. ఇపుడు అనుష్క ఆస్ట్రియా వైద్యం పాటిస్తోంది. ఆమెకి ఈ బాధ ప‌ర్మినెంట్‌గా పోవాల‌ని కోరుకుందాం.