ష్‌...నిశ్శబ్దం అంటున్న అనుష్క‌

Anushka's film titled Nishabdam?
Sunday, March 3, 2019 - 17:45

భాగమతి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క.. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. కోన వెంకట్, గోపీమోహన్ ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించారు. కథ ప్రకారం భారీ షెడ్యూల్ అమెరికాలో చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న కఠిన నిబంధనల కారణంగా అమెరికాలో షూటింగ్ అంటే అతికష్టంగా మారింది. అందుకే అనుష్క కొత్త సినిమా వాయిదా పడే అవకాశాలున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కోన వెంకట్ వీటిని ఖండించాడు. 

తమ సినిమా అమెరికాలోని సియాటిల్ లో అతి త్వరలో ప్రారంభం అవుతుందని ప్రకటించాడు కోన వెంకట్. ఇప్పటివరకు ఎన్నడూ చూడని సరికొత్త కోణంలో, కొత్త మేకోవర్ లో అనుష్కను అంతా చూస్తారని ఊరిస్తున్నాడు కోన. సినిమా సెట్స్ పైకి వచ్చిన వెంటనే అమెరికా నుంచే అప్ డేట్స్ అందిస్తామని కూడా అంటున్నాడు.

మరోవైపు ఈ సినిమాకు "నిశ్శబ్దం" అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమాను సైలెన్స్ అనే పేరుతోనే సంభోదిస్తున్నారు. త్వరలోనే ఈ టైటిల్ పై సస్పెన్స్ కూడా వీడబోతోంది. సవ్యసాచి తర్వాత మాధవన్, నేరుగా తెలుగులో చేస్తున్న సినిమా ఇదే.