ఇంత‌కీ అనుష్క ఏమి చెపుతోంది?

Anushka's Instagram pic sparks speculations
Sunday, October 28, 2018 - 00:15

అనుష్క‌కి ప్ర‌కృతి అంటే చాలా ఇష్టం. ఆమె ఇపుడు నేచ‌ర్‌తో మమేకం అవుతోంది. నార్వే కొండ‌ల్లో ఉన్న ఒక ప్ర‌కృతి వైద్య‌శాల‌లో ఆమె చికిత్స తీసుకుంటోంది. నేచుర‌ల్‌గా బ‌రువు త‌గ్గే ట్రీట్‌మెంట్‌. బ‌హుశా అక్క‌డి కొండ‌లు, కోన‌ల నుంచే కాబోలు రెండు ఫోటోల‌ను త‌న ఇన్‌స్ట్రాగ్రామ్ నుంచి షేర్ చేసింది. ఒక ఫోటో.. అందంగా విరిసిన పువ్వుది. మ‌రోటి నీటిలో త‌డిసిన త‌న పాదం ఫోటో.

ఈ పాదం ఫోటోకి.. క్యాప్స‌న్ అవ‌స‌రం లేదు అనే క్యాప్స‌న్‌ని రాయ‌డం, ఆమె కాలి వేలికి ఒక తీగ కాలిమెట్ట‌లా అల్లుకోవ‌డంతో... జ‌నం ర‌క‌ర‌కాలుగా కామెంట్‌లు పెడుతున్నారు. ఎవ‌రా ల‌క్కీ ప‌ర్స‌న్‌, ఎపుడు పెళ్లి అంటూ క్వ‌శ్చ‌న్స్ వేస్తున్నారు. ఆమె ఏ ఉద్దేశంతో ఆ ఫోటో వేసిందో తెలియ‌దు. కానీ క్యాప్స‌న్ అవ‌స‌రం లేదు అన్న ఈ ఫోటోకి అభిమానులు ఆప్స‌న్స్ ఇవ్వ‌కుండా పెళ్లి ఎపుడు అనే క్వ‌శ్చ‌న్స్ వేస్తున్నారు.

అనుష్క - ప్ర‌భాస్ పెళ్లి అంటూ ఓ ఏడాది క్రితం వ‌ర‌కు ఊహాగానాలు సాగాయి. ఐతే ఇద్ద‌రూ నిర్ద్వందంగా తోసిపుచ్చారు. త‌మ మ‌ధ్య అది లేద‌ని క్లారిటీ ఇచ్చారు. కేవ‌లం స్నేహితులం మాత్ర‌మే అని స్ప‌ష్టం చేశారు.

ఇంత‌కీ ఆమె ఫోటోకి నిజ‌మైన అర్థం ఏంటి?