సియాటెల్‌లో సైలెన్స్ అంటున్న స్వీటీ

Anushka's Silence shoot begins in Seattle on May 24
Wednesday, May 15, 2019 - 22:00

అనుష్క మ‌ళ్లీ న‌టిగా బిజీ అవుతోంది. ఇప్ప‌టికే "సైరా" సినిమాలో ఒక చిన్న పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ పాత్ర‌కి సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఇక మే 24 నుంచి అనుష్క "సైలెన్స్" అనే సినిమా షూటింగ్ మొద‌లుపెట్ట‌నుంది. ఇందులో ఆమె మెయిన్ హీరోయిన్‌. మాధ‌వ‌న్ హీరో. ఐతే ఇది ఒక విధంగా హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్ల‌ర్‌. అనుష్క చుట్టూ క‌థ రివాల్వ్ అవుతుంది.

అనుష్క హీరోయిన్‌గా ఒక సినిమా తీస్తున్న‌ట్లు ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్ గ‌తేడాది ప్ర‌క‌టించారు. అదే ఈ సైలెన్స్‌. ఇన్నాళ్లూ వీసా స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆల‌స్య‌మ‌యింది. హేమంత్ మ‌ధుక‌ర్ అనే ద‌ర్శ‌కుడు రూపొందిస్తున్న ఈ మూవీకి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ప‌ని చేయ‌నున్నారు. అనుష్క ఇటీవ‌ల చాలా స‌న్న‌బ‌డింది. యూరోప్‌కి వెళ్లి అక్క‌డ ప్ర‌కృతి వైద్యం చేయించుకొంది. అలా స్లిమ్‌గా మారింది. గ‌తేడాది మొత్తంగా సినిమాల‌కి దూరంగా ఉంది. ఇపుడు స్లిమ్ కావ‌డంతో మ‌ళ్లీ సినిమాలు సైన్ చేస్తోంది.