త్వ‌ర‌లోనే రెడ్డ‌మ్మ త‌ల్లి పాట‌

Aravindha Sametha: Reddamma Talli song
Saturday, October 13, 2018 - 23:45

"ఊరికి ఉత్త‌రాన...దారికి ద‌క్షిణాన‌..ఓ రెడ్డ‌మ్మ త‌ల్లి" అనే పాట "అర‌వింద స‌మేత" సినిమా చివ‌ర్లో వ‌స్తుంది. అది ఒక బిట్ సాంగ్‌. సినిమాలో బాగా కుదిరిన పాట అది. ఎమోష‌న‌ల్‌గా సాగే ఈ పాట‌ని ఈశ్వ‌రీరావుపై చిత్రీక‌రించారు. సినిమాలో చివ‌రి ఘ‌ట్టంలోని స‌న్నివేశాలు న‌డుస్తున్న‌ప్పుడు వ‌చ్చే పాట‌. 

మ్యూజిక్ ఆల్బ‌మ్‌లో కానీ, జ్యూక్‌బాక్స్‌లో కానీ ఈ పాట లేదు. సెన్సార్‌కి రెండు రోజుల ముందు చివ‌రి నిమిషంలో ఈ పాట‌ని యాడ్ చేశారు. క్ల‌యిమాక్స్‌లో ఒక ఎమోష‌న‌ల్ పాట ఉంటే క‌థ ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంద‌ని త్రివిక్ర‌మ్ భావించ‌డంతో అప్ప‌టిక‌పుడు కంపోజ్ చేశాడు త‌మ‌న్‌. ర‌చ‌యిత పెంచ‌ల‌దాసు, త్రివిక్ర‌మ్ క‌లిసి ఈ పాట‌ని రాశారు. 

అభిమానులంతా ఈ పాట‌ని విడుద‌ల చేయాల‌ని కోర‌డంతో వ‌చ్చే వారం ఈ పాట లిరిక‌ల్ ఆడియో సాంగ్‌ని రిలీజ్ చేస్తాన‌ని సంగీత ద‌ర్శ‌కుడు మాట ఇచ్చాడు. రంగ‌స్థ‌లంలో చావు పాట ఎలా క్లిక్ అయిందో, ఈ రెడ్డ‌మ్మ త‌ల్లి పాట కూడా ఈ సినిమాలో అంత‌గా న‌ప్పింది.