ఆర్య‌, సాయేషా ఒక‌ట‌య్యారు

Arya Sayyesha wedding
Sunday, March 10, 2019 - 12:45

త‌మిళ హీరో ఆర్య‌, సాయేషా ఒక‌ట‌య్యారు. వీరి పెళ్లి వేడుక ఆదివారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. 

వీరి సంగీత్ , ఇత‌ర ప్రివెడ్డింగ్ సంబ‌రాలు కూడా హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. హీరో అల్లు అర్జున్ స‌హా ప‌లువురు సినిమా తార‌లు సంగీత్‌లో హడావుడి చేశారు. వ‌రుడు, సైజ్‌జీరో వంటి తెలుగు సినిమాల్లో నటించిన త‌మిళ హీరో ఆర్య‌కి 38 ఏళ్లు. 21 ఏళ్ల సాయేషా సైగ‌ల్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గ‌జినికాంత్ అనే త‌మిళ సినిమాలో వీరిద్ద‌రూ క‌లిసి నటించారు. ఆ సినిమా షూటింగ్‌లోనే ప్రేమ‌లో ప‌డ్డారు. ఇరువైపులా పెద్ద‌లు అంగీక‌రించ‌డంతో ఆదివారం (మార్చి 10) వీరి పెళ్లి జగింది.

సాయేషా బంధువులంతా హైద‌రాబాద్‌లోనే ఉంటారు. అందుకే హైద‌రాబాద్‌లో సంప్ర‌దాయ ముస్లిం ప‌ద్ద‌తిలో వీరి పెళ్లి వేడుక‌ని నిర్వ‌హించారు. సాయేషా అఖిల్ హీరోగా న‌టించిన మొద‌టి సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. 

ఆర్య‌..త‌మిళంలో లీడింగ్ స్టార్‌. మ‌రోవైపు, త‌మ జీవ‌న ప్ర‌యాణం మొద‌లైంది అంటూ ఆర్య సంగీత్ సంద‌ర్భంగా తీసిన ఫోటోల‌ను షేర్ చేశాడు.