ఫ‌లానా చిత్రానికి ఫ‌లానా టైటిల్‌!

Avasarala movie is titled Phalana Abbayi Phalana Ammayi
Wednesday, March 13, 2019 - 13:30

అమ్మాయిలు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, త‌ను నేను, ఆమె అత‌ను....ఇలా ఎన్నో టైటిల్స్ వ‌చ్చాయి. అత‌డు, ఆమె సినిమాలు కూడా వ‌చ్చాయి. మ‌రి ఈ టైప్ టైటిల్స్‌లో ఇంకా ఏమీ మిగ‌ల్లేదు. అందుకే 

"ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" అనే పేరుని ఫిక్స్ చేసుకున్నాడు అవసరాల శ్రీనివాస్. సింపుల్‌గా చెప్పాలంటే అబ్బాయి అమ్మాయి టైటిల్‌కి ఫ‌లానా అని యాడ్ చేశాడు. ఏ మాట‌కి ఆ మాట..టైటిల్ విన‌డానికి బాగుంది. ఊహలు గుసగుసలాడే,  జో అచ్యుతానంద చిత్రాల త‌ర్వాత అవ‌స‌రాల ద‌ర్శ‌కుడిగా రూపొందిస్తున్న మూడో చిత్రానికి ఈ పేరు పెట్టాడ‌ట‌. 

ఈ సినిమాలో అబ్బాయిగా నాగ‌శైర్య‌, అమ్మాయిగా మాళ‌విక నాయ‌ర్ క‌నిపిస్తారు. ఇంత‌కుముందు ఈ జంట "కళ్యాణ వైభోగ‌మే" అనే సినిమాలో క‌నిపించ‌నుంది. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది ఈ మూవీ.