ఓంకార్ గదిలోకి వెళ్లిన హీరోయిన్

Avika Gor in Raju Gari Gadhi 3
Monday, July 15, 2019 - 19:00

ఇందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏంలేదు. రాజుగారి గది 3 అనే సినిమా చేస్తున్నాడు ఓంకార్. ఆ గదిలోకి వెళ్లడానికి హీరోయిన్లు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. చివరాఖరికి అవికా గౌర్ అందుకు ఒప్పుకుంది. "రాజుగారి గది-3"లో లీడ్ రోల్ పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపోమాపో దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది.

ముందుగా ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నాను అనుకున్నారు. ఓపెనింగ్ కు కూడా హాజరైన ఆమె, తర్వాత హ్యాండ్ ఇచ్చింది.  తర్వాత కాజల్ ను అనుకున్నారు. కానీ కాజల్ కూడా ఓంకార్ అన్నయ్యకు చాకచక్యంగా హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత నందిత శ్వేత, తాప్సి లాంటి పేర్లు కూడా తెరపైకి వచ్చినప్పటికీ ఓంకార్ "గది"లోకి వెళ్లేందుకు ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. చివరికి అవికా గౌర్ అందుకు ఒప్పుకుంది. 

అవికా ఈ సినిమా ఒప్పుకోవడానికి ఓ రీజన్ ఉంది.  ఎవరు ఛాన్స్ ఇస్తారా అని ఎదురుచూస్తోంది ఈ బ్యూటీ. కొన్ని కారణాల వల్ల దాదాపు టాలీవుడ్ మొత్తం ఈమెను అన్-అఫీషియల్ గా బ్యాన్ చేసింది. అందుకే ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, లక్ష్మీరావే మా ఇంటికి, సినిమా చూపిస్త మామ లాంటి సినిమాలు హిట్ అయినప్పటికీ అవికాకు మళ్లీ అవకాశాలు రాలేదు. 

ఎట్టకేలకు ఓంకార్ ఈమెకు ఓ అవకాశం ఇచ్చాడు. అదే ఇప్పుడు అవికాకు మహాప్రసాదం. అందుకే మారుమాట్లాడకుండా ఈ సినిమాలో నటించడానికి ఆమె ఒప్పుకుందట.