బద్దకంతోనే లావెక్కాను!

Avika Gor talks about her weight issue
Sunday, October 27, 2019 - 10:00

రాజుగారి గది 3తో రీఎంట్రీ ఇచ్చిన అవికా తను బాగా బరువు తగ్గానంటోంది. చూసేవాళ్లకు మాత్రం ఆ విషయం తెలియడం లేదు. అవికా ఎప్పట్లానే బొద్దుగా ఉందనే అనుకుంటున్నారు. కానీ ఈ బొద్దుగుమ్మ మాత్రం తను అమాంతం 12 కిలోలు తగ్గానంటోంది ఆశ్చర్యంగా. సరే.. ఆ సంగతి పక్కనపెడితే, ఇంత బరువు ఎందుకు పెరిగారు, ఎలా పెరిగారు అనే ప్రశ్నకు మాత్రం ఉన్నది ఉన్నట్టుగా సమాధానం చెప్పేసింది అవికా.

తనకు చిన్న హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందని, డైట్ లో చిన్న మార్పులు జరిగాయని, అందుకే కాస్త బరువు పెరిగానని కవరింగ్ లు ఇచ్చుకోలేదు అవిక. కేవలం బద్ధకం వల్లనే బరువు పెరిగానంటోంది.  మూడు పూటలు ఫుల్లుగా తిని, ఎలాంటి ఎక్సర్ సైజులు చేయకపోవడం వల్లనే బరువు పెరిగానని, అంతేతప్ప తనకు ఎలాంటి రోగం లేదని నికార్సుగా చెబుతోంది.

'రాజుగారి గది 3' ప్రచారం కోసం చిన్న సైజు మినీ స్కర్ట్ తో మీడియా ముందుకొచ్చింది అవిక. ఇదేదో సినిమా అవకాశాల కోసం ఇలా టైట్ ఫిట్ దుస్తుల్లో కెమెరాల ముందుకు రాలేదని, ఇలాంటి దుస్తులు వేసుకోవడం తనకు అలవాటే అంటోంది అవిక. మొత్తమ్మీద సెకెండ్ ఇన్నింగ్స్ లో అవిక కాస్త రూటు మార్చినట్టే కనిపిస్తోంది. గతంలో ఓ హీరోపై పరోక్షంగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పరిశ్రమను బాగానే అర్థంచేసుకున్నట్టుంది.