బాల‌య్య‌లో ఎంత మార్పు?

Balakrisha changes his speech style
Saturday, January 26, 2019 - 23:15

నంద‌మూరి బాల‌కృష్ణ‌కి న‌టుడిగా ఎంతో మంచి పేరుంది. స్టార్‌గా ఆయ‌న‌కి తిరుగులేదు. ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ సూప‌ర్‌స్టార్స్‌ల‌లో ఒక‌రు బాల‌య్య‌. వెండితెర‌పై అద్భుతంగా డైలాగ్‌లు చెప్పే బాల‌య్య‌....బ‌య‌ట ఫంక్ష‌న్‌ల‌లో మాత్రం ఏదేదో మాట్లాడుతుంటారు. ఏదో చెప్పాల‌నుకొని మ‌రేదో చెప్పుతుంటారు. గ‌తంలో బాల‌య్య స్పీచ్‌లపై ఎవ‌రో ఒక‌రు విమ‌ర్శ‌లు చేసేవారు. ఐతే సోష‌ల్ మీడియా జ‌మానాలో ఎంత గొప్ప హీరో అయినా త‌ప్పు చేస్తే జీరో అవుతున్నారు. జ‌నాలు ట్రోలింగ్ చేయ‌డంలో ఎవ‌ర్నీ క‌నికరించ‌డం లేదు. 

ముఖ్యంగా బాల‌య్య స్పీచ్‌లు బాగా వైర‌ల్ అవుతుంటాయి. కామెడీ స‌రుకుగా మారాయి ఆయ‌న స్పీచ్‌లు. రీసెంట్‌గా జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా సారా జ‌హాసే అచ్చా గీతాన్ని అడ్డ‌గోలుగా చ‌ద‌వి అభాసుపాలు అయ్యారు. బహుశా బాల‌య్య ఈ విష‌యాన్ని గ్ర‌హించిన‌ట్లున్నారు. మునుప‌టిలో ప్రిపేర్ అవ‌కుండా స్పీచ్‌లు ఇవ్వ‌డం లేదు. 

తాజాగా రిప‌బ్లిక్ డే సంబ‌రాల్లో కొత్త‌ బాలయ్య క‌నిపించాడు. హుందాగా, ప‌ద్ద‌తిగా స్పీచ్ ఇచ్చాడు. ట్రోల‌ర్స్‌కి ఎక్క‌డా ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తపడ్డాడు.