బాల‌య్యతో బోయపాటికి మూవీ క‌ష్ట‌మే

Balakrishna and Boyapati movie
Tuesday, May 28, 2019 - 00:30

నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. పార్టీ ఓడినా... జ‌గ‌న్ వేవ్‌లో బాల‌య్య మ‌రోసారి ఎమ్మెల్యేగా నెగ్గుకురావ‌డం విశేషమే. ఇక ఇపుడు బాల‌య్య త‌న తదుప‌రి చిత్రంపై ఫోక‌స్ పెడుతున్నారు. ఆయ‌న నెక్స్ట్ మూవీ బోయ‌పాటితో కాదు కె.ఎస్‌.ర‌వికుమార్‌తో. మ‌రి బోయ‌పాటి, బాల‌య్య కాంబినేష‌న్ ఇప్ప‌ట్లో సెట్ అవ‌దా?

బోయ‌పాటితోనే బాల‌య్య సినిమా చేద్దామ‌నుకున్నారు కానీ ఆ ద‌ర్శ‌కుడు చెప్పిన బ‌డ్జెట్ విని షాక్ తిన్నాడు. బాల‌య్య‌తో దాదాపు 60 కోట్ల సినిమాని ప్లాన్ చేశాడ‌ట బోయ‌పాటి. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు ...రెండు చిత్రాల వ‌ల్డ్‌వైడ్ వ‌సూళ్లే 20 కోట్ల రూపాయ‌లు. ఇక బాల‌య్య కెరియ‌ర్‌లోనే హ‌య్యెస్ట్ వ‌సూళ్ల సినిమా 50 కోట్లు (గౌత‌మీపుత్ర‌శాత‌క‌ర్ణి). మ‌రి  60 కోట్ల బ‌డ్జెట్ ఎలా వ‌ర్క‌వుట్ అవుద్ది ?

అందుకే ఏ నిర్మాత ముందుకు రావ‌డం లేదు. బోయ‌పాటి బ‌డ్జెట్‌ని 35 కోట్ల‌కి అయినా త‌గ్గించుకోవాలి లేదంటే మంచి పార్టీని అయినా ప‌ట్టుకోవాలి. ఈ టైమ్‌లో బాల‌య్య‌తోనూ, బోయ‌పాటితోనూ అంత రిస్క్ తీసుకునే నిర్మాత‌లు దొర‌క‌డం క‌ష్టం. బాల‌య్య అధికారంలో కూడా లేరు. ఆయ‌నతో సినిమా చేసి లాభాలు రాకున్నా... గ‌వ‌ర్న‌మెంట్‌లోఏదో ఒక ప్రాజెక్ట్ ప‌ట్టేసుకుందామ‌కునేందుకు నిర్మాత‌ల‌కి ఆప్స‌న్ కూడా లేదు.