క‌థ మార్చ‌క‌పోతే కొంప మునుగుతుందా?

Balakrishna and K S Ravikumar film's story undergoing changes?
Tuesday, May 28, 2019 - 23:00

ఇందులో నిజ‌మెంతో తెలియ‌దు కానీ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం బాల‌య్య కొత్త సినిమా క‌థని మార్చేస్తున్నార‌ట‌. దానికి ఇటీవ‌ల విడుద‌లైన ఎన్నిక‌ల ఫ‌లితాల‌కి లింక్ ఉంద‌నేది ఈ వార్తాక‌థ‌నాల మాట‌. 

కె.ఎస్‌.ర‌వికుమార్ డైర‌క్ష‌న్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా ఒక సినిమాని తీయనున్నట్లు ఇటీవ‌లే నిర్మాత సి.క‌ల్యాణ్ నుంచి అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. తీరా షూటింగ్‌కి వెళ్లే టైమ్‌లో ఈ సినిమా క‌థ మార‌బోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో ఒక విల‌న్ పాత్ర అచ్చంగా ఏపీ కొత్త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ పోలీక‌ల‌తో క్రియేట్ చేశార‌ట‌. మ‌ళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వ‌స్తుంద‌నే భ్ర‌మ‌ల్లో అలా పాత్ర‌ని డిజైన్ చేశార‌ట‌. ఇపుడు ఈ సినిమాని అలాగే తీస్తే.... జ‌గ‌న్ తాట తీస్తాడ‌ని సీ క‌ల్యాణ్ భ‌య‌ప‌డిపోయి క‌థ‌ని ఛేంజ్ చేయిస్తున్నాడ‌నేది గుస‌గుస‌.

మ‌రి బాల‌య్య కొత్త సినిమా ఇప్ప‌ట్లో మొద‌ల‌య్యేలా లేదు. అటు బోయ‌పాటి మూవీ ఆగి, ఇటు కె.ఎస్‌.ర‌వికుమార్ మూవీ స్టార్ట్ కాక‌....బాల‌య్య గ్యాప్ తీసుకోవాల్సిందే.