బాలకృష్ణ వీరంగం, ఈ సారి కార్యకర్త పై చేయి

Balakrishna beats TDP worker
Sunday, April 7, 2019 - 22:30

మరోసారి నందమూరి బాలకృష్ణ సొంత అభిమానిని కొట్టారు. ఆదివారం విజయనగరం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నడిరోడ్డుపై అభిమానిని  వెంబడించి మరీ కొట్టారు బాలయ్య. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చీపురుపల్లిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన బాలయ్య ఉన్నట్టుండి తన వెహికల్ దిగి... పార్టీ కార్యకర్త కం అభిమానిని గల్లా పట్టుకొని మరి కొట్టారు. 

కార్యకర్తలు ఫొటో తీసుకోవడానికి ఎగబడ్డంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన ఆయన ఓ కార్యకర్త వెంటపడ్డారు. నడిరోడ్డుపై పరుగులు పెట్టించి అతడిపై పిడిగుద్దులు గుద్ది.. కాళ్లతో తన్నారు.  ఆ అభిమానిని   బూతులు కూడా తిట్టారు. టీడీపీ నేతలు ఒక్కసారిగా షాక్ తిన్నారు బాలయ్య తీరుతో