ఖాకీ అవ‌తారంలో బాల‌య్య‌

Balakrishna as cop
Saturday, April 27, 2019 - 23:45

నంద‌మూరి బాల‌కృష్ణ ఇటీవ‌లే ఒక కొత్త సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. పాత చింత‌కాయ ప‌చ్చ‌డిలాంటి సినిమాలు తీసే పాత త‌రం ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ డైర‌క్ష‌న్‌లో బాల‌య్య న‌టించ‌నున్నాడు. ఈ సినిమాలో ఆయ‌న ఎస్పీగా న‌టించ‌నున్నాడు. ఒక జిల్లా ముఖ్య పోలీసు అధికారి పాత్ర‌లో బాల‌య్య క‌నిపించ‌నున్నాడు. 

అన్న‌ట్లు ఈ సినిమాలో కూడా బాల‌య్య స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్లు. ఒక ఐటెంగాల్ ఉంటుంద‌ట‌. స్పీడ్‌గా సినిమాని పూర్తి చేస్తాడ‌ట కె.ఎస్‌.ర‌వికుమార్‌. కుదిరితే ద‌స‌రాకి లేదంటే సంక్రాంతికి ....అన్న‌ట్లుగా ప్లాన్ చేస్తున్నారు.