బాల‌కృష్ణ గ్రేట్ క‌మెడియ‌న్‌: నాగ‌బాబు

Balakrishna is a great comedian, says Naga Babu
Monday, December 10, 2018 - 17:15

నాగ‌బాబు వెర్సెస్ బాల‌కృష్ణ‌....ఇద్ద‌రి మ‌ధ్య సైలెంట్ వార్ న‌డుస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌రు అని ఆ మ‌ధ్య నంద‌మూరి బాల‌కృష్ణ హిందూపూర్‌లో చేసిన వ్యాఖ్య‌ల‌కి కౌంట‌ర్‌గా నాగ‌బాబు రెండు రోజులుగా బాలయ్య మీద ఇన్‌డైర‌క్ట్ సెటైర్‌లు సంధిస్తున్నాడు. రీసెంట్‌గా ఒక యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంట‌ర్వ్యూలో బాల‌య్య ప్ర‌స్తావ‌న వ‌స్తే..ఆయ‌న ఎవ‌రు అంటూ నాగ‌బాబు స్పందించాడు. పాత‌కాలం న‌టుడు ఎం.బాల‌య్య త‌ప్ప మ‌రే బాల‌య్య (నంద‌మూరి బాల‌కృష్ణ‌) తెలీద‌న్నాడు. 

దాంతో సోష‌ల్ మీడియాలో నాగ‌బాబుని ఓ రేంజ్‌లో ట్రోల్ చేయడం మొద‌లుపెట్టారు బాల‌య్య అభిమానులు. కొంతమంది నాగ‌బాబు స‌న్నిహితులు కూడా అలా అని ఉండాల్సింది కాద‌ని చెప్పార‌ట‌. అందుకే ఇపుడు త‌న ఫేస్‌బుక్‌లో మ‌రో వీడియో పెట్టాడు. ఈ సారి మ‌రింతగా సెటైర్లు దంచాడు నాగ‌బాబు. బాల‌కృష్ణ గొప్ప క‌మెడియ‌న్‌. అలాంటి హాస్య న‌టుడు గురించి నాకు తెలియ‌దు అని మొన్న చెప్ప‌డం త‌ప్పే అంటూ ఇపుడు మ‌రోసారి త‌న మాట‌ల‌తో క‌ల‌క‌లం రేపుతున్నాడు. 

ఇంత‌కీ బాల‌య్య‌ని క‌మెడియ‌న్ అని నాగబాబు వ‌ర్ణించ‌డం వెనుకున్న అస‌లు మేట‌ర్ ఏంటో తెలియాలంటే ఆయ‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోని చూడండి. కింద లింక్ ఉంది.