అర‌వింద ఈవెంట్‌కి బాల‌య్య‌?

Balakrishna as guest for Aravindha Sametha
Saturday, September 8, 2018 - 15:30

మొన్న‌టి వ‌ర‌కు ఉప్పు నిప్పుగా ఉన్న బాబాయ్ అబ్బాయ్ ఇపుడు పాలు, నీళ్లుగా క‌లిసిపోయార‌ని టాక్‌. త‌న సోద‌రుడు నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత బాల‌కృష్ణ పాత విభేదాల‌ను ప‌క్క‌న పెట్టి జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో మాటాముచ్చ‌ట క‌లిపాడు. ఇపుడు ఇరు కుటుంబాల మ‌ధ్య అంతా బానే ఉంద‌ట‌.

ఇదే ఊపుని కంటిన్యూ చేద్దామ‌నే ప్ర‌య‌త్నంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌..బాల‌య్య‌ని త‌న సినిమా ఈవెంట్‌కి ఆహ్వానించాడ‌నేది టాక్‌.  త్వ‌ర‌లోనే "అర‌వింద స‌మేత" ఆడియో విడుదల జ‌ర‌గ‌నుంది. ఈ నెల మూడో వారంలో హైద‌రాబాద్‌లో ఈవెంట్ నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు మొద‌ల‌య్యాయి. బాబాయ్‌ని గెస్ట్‌గా పిలిస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న చేసి వెంట‌నే అడిగాడ‌ట‌. దానికి బాల‌య్య సై అన్నాడ‌నేది అభిమానులు సోష‌ల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. ఐతే ఇది ప్ర‌చారంగానే మిగిలిపోతుందా? నిజంగా జ‌రుగుతుందా అనేది చూడాలి.

త్రివిక్ర‌మ్ తీస్తున్న అర‌వింద స‌మేత షూటింగ్ జోరుగా సాగుతోంది. ఐతే అర‌వింద టీమ్ మాత్రం దీనిపై స్పందించ‌లేదు ఇంకా.