నాగబాబుపై బాల‌య్య కామెంట్ ఇదే

Balakrishna responds on Naga Babu's comments
Tuesday, January 8, 2019 - 15:30

త‌న‌పై వ‌రుస‌గా వీడియో కామెంట్ల‌తో క‌ల‌క‌లం రేపుతోన్న నాగ‌బాబుపై స్పందించేందుకు బాల‌య్య నిరాక‌రించారు. నాగ‌బాబు కామెంట్స్‌పై మీ స్పంద‌న ఏంట‌ని తిరుప‌తిలో మీడియా ప్ర‌శ్నించ‌గా నో కామెంట్ అని ముక్త‌స‌రిగా స‌మాధానం ఇచ్చారు.

విద్యాబాలన్‌, సుమంత్‌, సాయి కొర్రపాటిల‌తో క‌లిసి బాల‌య్య ఈ రోజు తిరుమ‌ల తిరుప‌తి వ‌చ్చారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు ‘యన్‌టిఆర్‌ కథానాయకుడు’ చిత్రం బుధవారం విడుదలవుతున్న కారణంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చామని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు బాలకృష్ణ తెలిపారు.

నాగ‌బాబు గురించి మీడియా ఎంత ప్ర‌శ్నించినా బాల‌య్య సైలెంట్‌గానే ఉన్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమా గురించి త‌ప్ప మ‌రోటి మాట్లాడ‌న‌ని అన్న‌ట్లుగా హింట్ ఇచ్చారు.