వివాదాల్లో బాలయ్య చిన్నల్లుడు

Balakrishna son-in-law Bharat Kumar faces allegations
Wednesday, August 28, 2019 - 13:00

మొన్నటి వరకు లోకేష్‌ గురించి వార్తలు వచ్చేవి. నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు కూడా ఇపుడు వార్తల్లో నిలుస్తున్నాడు. చిన్నల్లుడు భరత్‌ ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొన్న జూనియర్‌ ఎన్టీఆర్‌పై కొన్ని ఘాటైన కామెంట్స్‌ చేశాడు. తెలుగు దేశం పార్టీకి జూనియర్‌ ఎన్టీఆర్‌ అవసరం లేదని కలకలం రేపాడు. ఇక తాజాగా అల్లుడు గిల్లుడు అంటూ ఆరోపణలు వస్తున్నాయి.

నందమూరి బాలయ్య తన చిన్నల్లుడు భరత్‌కి దాదాపు 500 ఎకరాలు అమరావతి రాజధాని జోన్లు ఎకరానికి లక్ష రూపాయలు చొప్పున కట్టబెట్టాడనేది ఆరోపణ. ఈ ఆరోపణ చేసింది ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బొత్స సత్యనారయణ. అంటే గత ప్రభుత్వంలో బాలయ్య తన అల్లుడికి ఇంత లబ్ధి చేశాడట. ఇలా అల్లుడుతో పాటు బాలయ్య కూడా ఈ ఆరోపణల్లో ఇరుక్కొన్నారు.