ఇఫ్తార్ విందు ఇచ్చిన బాల‌కృష్ణ‌

Balakrishna throws Iftaar party
Saturday, June 1, 2019 - 15:30

రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత నంద‌మూరి బాల‌కృష్ణ త‌న శైలిని మార్చుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. మొద‌టిసారి హిందూపురంలో గెలిచిన త‌ర్వాత జ‌నాల‌ను పట్టించుకోవ‌డం మానేశార‌ని విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. విమ‌ర్శ‌లు వ‌చ్చినా, జ‌గ‌న్ వేవ్‌లోనూ బాల‌య్య హిందూపురంలో రెండోసారి గెల‌వ‌డం అక్క‌డ ఆయ‌నకున్న క్రేజ్‌కి నిద‌ర్శ‌నం. 

ఐతే ఈసారి జ‌నంతో ఎక్కువ‌గా మమేకం కావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లున్నారు. తాజాగా ముస్లింల‌కి  ఇఫ్తార్ విందు ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. హిందూపురంలో ముస్లిం సోదరుల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. ఆనందంగా వారితో ముచ్చ‌టించారు.

మ‌రోవైపు, బాల‌కృష్ణ కొత్త సినిమా ఈ నెలలోనే ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంది. కె.ఎస్‌.ర‌వికుమార్ డైర‌క్ష‌న్‌లోనే సీ క‌ల్యాణ్ ఈ కొత్త సినిమాని నిర్మిస్తారు. ఈ మూవీ ఆగిపోయింద‌న్న వార్త‌ల‌ను సీ క‌ల్యాణ్ కొట్టిపారేశారు. షూటింగ్ మాత్రం జులైలో మొద‌లవ్వొచ్చు.