గీతాంజలి మృతిపై బాలయ్య ఎమోషన్

Balayya about Geethanjali
Thursday, October 31, 2019 - 15:45

సీనియర్ ఆర్టిస్టులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు బాలకృష్ణ. మరీ ముఖ్యంగా తండ్రి ఎన్టీఆర్ నటించిన హీరోయిన్లందరితో ప్రేమగా ఉంటారు. వాళ్లను సొంత మనుషుల్లా చూసుకుంటారు. ఏ ఫంక్షన్ చేసినా, ఆహ్వానించి వాళ్లకు మంచి గౌరవం ఇస్తారు. అలాంటి ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు గీతాంజలి. ఈరోజు గీతాంజలి కన్నుమూశారనే విషయం తెలుసుకున్న వెంటనే షాక్ అయ్యారు బాలయ్య. ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

"గీతాంజలి గారు పరమపదించారనే వార్త తెలిసిన వెంటనే షాక్ అయ్యాను. ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారు.  మా కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న వారిలో ఆవిడ ఒకరు. నాన్నగారంటే ఆవిడకు ఎంతో అభిమానం. నాన్నగారు డైరక్ట్ చేసిన సీతారామకల్యాణం సినిమాలో  సీత పాత్రలో గీతాంజలి గారు నటించారు. నటనలో ఆవిడ ఎప్పుడూ నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకునేవారు. తెలుగు సినిమాల్లో నటిగా తనదైన ముద్రవేశారు. అలాంటి గొప్ప నటి మనల్ని విడిచిపెట్టి పోవడం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమె కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను."