హ్యాట్రిక్ దిశగా బాలయ్య!

Balayya three flops in a single year
Saturday, December 21, 2019 - 20:30

వరుసగా మూడు ప్లాప్లు చూసిన హీరోల సంఖ్య ఎక్కువే. కానీ సింగిల్ ఇయర్ లో వరుసగా మూడు ప్లాపులు అంటే అది రేర్ అనే చెప్పాలి. అలాంటి హ్యాట్రిక్ బాలయ్య ఖాతాలో క్రెడిట్ కానుంది. ఈ ఏడాది ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో అపజయాలు వచ్చాయి. ఇప్పుడు 'రూలర్' కూడా ప్లాప్ దిశగానే సాగుతోంది. 

అలా రూలర్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల రూపాయలకు అమ్మారు. కట్ చేస్తే, తొలి రోజు 4 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అంతా బాగానే ఉందనుకోవడానికి వీళ్లేదు. ఎందుకంటే రూలర్ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేసింది. ఈ సినిమా కోలుకోవడం ఇప్పుడు చాలా కష్టం. ఇప్పటికే మార్కెట్లో వెంకీమామ నడుస్తోంది. ప్రతిరోజూ పండగే సినిమాకు హిట్ టాక్ వచ్చింది. దబంగ్-3 మరోవారం పాటు గట్టిగా నిలబడేలా ఉంది. ఇలాంటి టఫ్ కండిషన్స్ లో రూలర్ సినిమా నిలబడ్డం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

బాలయ్య సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 17 కోట్ల రూపాయలు రావాలి. ఈ కంటెంట్, ఈ మౌత్ టాక్ తో 17 కోట్లు అంటే దాదాపు అసాధ్యం. సో.. ఈ సినిమాకు కూడా నష్టాలు తప్పేలా లేవు.  మహానాయకుడు సినిమాతో పోలిస్తే రూలర్ కలెక్షన్లు  చాలా బెటర్. ఈసారికి అలా సరిపెట్టుకోవాల్సిందే.