చంద్ర‌బాబుకి బాల‌య్య వార్నింగ్‌!

Balayya's warning to Chandrababu Naidu
Wednesday, March 13, 2019 - 22:45

నంద‌మూరి బాల‌కృష్ణ మొత్తానికి త‌న ప్ర‌తాపం చూపించారు. టికెట్ల పంపిణీ విష‌యంలో త‌న ప‌ట్టు వీడ‌లేదు. బాల‌య్య త‌న చిన్న‌ల్లుడికి టికెట్ ఇవ్వాల‌ని తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుని చాలా కాలం క్రిత‌మే కోరారు. దానికి చంద్ర‌బాబు ఓకే అన్నారు. కానీ తీరా టికెట్ల కేటాయింపు టైమ్‌లో బాల‌య్య చిన్న‌ల్లుడికి టికెట్ ఇచ్చే విష‌యంలో బాబు అంత ఆస‌క్తి చూప‌డం లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దాంతో బాల‌కృష్ణ త‌న బావ బాబుపై సీరియ‌స్ అయ్యార‌ట‌.

తన చిన్నల్లుడు భరత్‌తో పాటు త‌న స్నేహితుడు కదిరి బాబూరావుకు టికెట్ ఇవ్వాల్సిందేనని బాలకృష్ణ ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఇపుడు బాబు అదే ప‌నిలో ఉన్న‌ట్లు టాక్‌. విశాఖపట్నం ఎంపీ సీటుని బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కి ఇవ్వ‌నున్నార‌ట‌. 

సో.. ఈ సారి బాల‌య్య పెద్ద‌ల్లుడు లోకేష్ మంగ‌ళ‌గిరి నుంచి అసెంబ్లీకి, చిన్న‌ల్లుడు విశాఖ‌ప‌ట్నం నుంచి పార్ల‌మెంట్‌కి బ‌రిలో ఉంటారు. ఇక బాల‌కృష్ణ హిందూపుర్ నుంచి మ‌రోసారి ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగ‌నున్నాడు.