బండ్ల అనే నేను అధికార ప్ర‌తినిధిని!

Bandla Ganesh now official spokesperson for Congress
Monday, November 19, 2018 - 14:00

ఎమ్మెల్యేగా అధికారం చేప‌ట్టాల‌ని క‌ల‌లు క‌న్నాడు న‌టుడు బండ్ల గ‌ణేష్‌. గ‌త రెండు నెల‌లుగా ఎంతో కామెడీ పండించాడు. ఎమ్మెల్యేగా సీటు గ్యారెంటీ అనుకున్నాడు. బండ్ల గ‌ణేష్ త‌ర‌ఫున మీడియా య‌జ‌మాని ఎంత లాబీయింగ్ చేసినా..కాంగ్రెస్ పార్టీ మాత్రం మొండిచెయ్యి చూపింది. ఐతే ఎమ్మెల్యేగా అధికారం బ‌దులు అధికార ప్ర‌తినిధిగా అధికారం ఇచ్చింది.

ఇక బండ్ల గ‌ణేష్‌..మీడియాతో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున అఫీషియ‌ల్‌గా మాట్లాడొచ్చు. కేసీఆర్‌..పోలవ‌రం ఎందుకు పూర్తి చేయలేదు అని త‌న‌దైన ప‌రిజ్ఞానంతో ప్ర‌శ్నించొచ్చు (ఇంత‌కుముందు ఒక సారి ఇలాగే అడిగాడు మ‌రి!).

బండ్ల గ‌ణేష్ అనే నేను అని ఎమ్మెల్యేగా ప్ర‌మాణం చేయాల‌నుకుంటే బండ్ల గ‌ణేష్ అనే నేను అధికార ప్ర‌తినిధిని అని చెప్పుకోవాల్సి వ‌స్తోంది. గుడ్డిలో మెల్ల ఏదో ఒక‌టి దొరికింద‌ని సమ్ తృప్తి ప‌డ‌డ‌మే!