100 కోట్లు గోవిందా!

Bhavya Ananda Prasad loses Rs 100 Cr?
Friday, December 14, 2018 - 15:15

నిర్మాత భవ్య ఆనంద ప్ర‌సాద్ ఇప్ప‌టివ‌ర‌కు ప‌లు సినిమాలు నిర్మించారు. అందులో ఆయ‌న‌కి వ‌చ్చిన విజ‌య‌శాతం చాలా త‌క్కువే. ఐతే ఏ సినిమాలోనూ ఆయ‌న భారీగా న‌ష్ట‌పోలేదు. రాజ‌కీయ నాయ‌కుడిగా అరంగేట్రంలోనే 100 కోట్లు స‌మ‌ర్పించుకోవాల్సి వ‌చ్చింది. ఆ వంద కోట్లు మూసీలో పోసిన ప‌న్నీరే అయింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చాలా కాన్ఫిడెంట్‌గా శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోకి తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్తిగా దిగాడు. ఐతే అక్క‌డ రెబెల్స్‌ని శాటిస్‌ఫై చేయ‌డానికి చాలానే ఖ‌ర్చ అయింది. అలాగే త‌న వంతుగా మ‌రో ఇద్ద‌రి అభ్య‌ర్థుల ఖ‌ర్చు పెట్టుకునేందుకు అంగీక‌రించాడ‌ట‌. ఇక త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనూ చాలా ఖ‌ర్చు పెట్టాల్సి వ‌చ్చింది. పార్టీ ఫండింగ్ కూడా భారీగానే స‌మ‌ర్పించుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. ఏతావాతా ఆయ‌నకి అక్ష‌రాలా 100 కోట్లు ఖ‌ర్చు అయ్యాయ‌నేది టాక్‌. ఇందులో నిజ‌మెంత అనేది చూడాలి.

భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌ళ్లీ ఆయ‌న సినిమాలు, అలాగే రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ వ్య‌వ‌హారాల‌తో బిజీ కానున్నారు. రాజ‌కీయ అరంగేట్రం పూర్తిగా న‌ష్ట‌ప‌రిచింది.