భూమిక ఇలా ఇర‌గ‌దీస్తోంది

Bhumika Chawla's hot pics
Wednesday, February 20, 2019 - 16:45

భూమిక ఇప్ప‌టికే అక్క‌, వదిన పాత్ర‌ల్లోకి వ‌చ్చింది. ఎంసీఏ సినిమాలో నాని వ‌దినగా ఇంప్రెస్ చేసింది. స‌వ్య‌సాచిలో చైత‌న్య అక్క‌గా క‌నిపించింది. యూ ట‌ర్న్‌లో చ‌నిపోయి వెంటాడే దెయ్యంగా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇలా వ‌రుస‌గా క్యార‌క్ట‌ర్ ఆర్టిస్ట్ పాత్ర‌ల‌తో సెటిల్ అయిపోయింది అనుకుంటున్న టైమ్‌లో ఆమె గ్లామ‌ర్ సోయ‌గాల‌తో హ‌ల్‌చ‌ల్ చేయ‌డం విశేషం.

ఆమె ఉన్న‌ట్లుండి ఒక హాట్ ఫోటోసూట్ చేసింది. ఆ ఫోటోల‌ను త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసింది. ఈ డ్రెస్సులో ఆమె చాలా యంగ్‌గా, హాట్‌గా క‌నిపిస్తోంది. 40 ప్ల‌స్‌లోనూ బాలీవుడ్ భామ‌లు ఇలాంటి ఫోటోసూట్‌లు చేస్తూ ఉంటారు. అదే బాట‌లో భూమిక ఇలా చేసిందా?  లేక ఇప్ప‌టికీ గ్లామ‌ర్ పాత్ర‌ల‌కి సై అని హింట్ ఇస్తోందా?