హైకోర్టుని అప్రోచ్ అయిన బిగ్‌బాస్‌

Bigg Boss approaches High Court of Telangana
Tuesday, July 16, 2019 - 15:45

బిగ్‌బాస్ సీజ‌న్ 3పై ఇద్ద‌రు బ‌డ్డింగ్ తార‌లు ఆరోప‌ణ‌లు చేశారు. క‌మిట్‌మెంట్ అడ‌గార‌నీ, త‌మ‌తో అస‌భ్యంగా మాట్లాడ‌ర‌నే ఆరోప‌ణ‌ల‌తో పాటు పోలీసు కేసులు కూడా వేశారు. దాంతో టీమ్ చీకాకుగా ఫీల్ అవుతోంది. ఈ నెల 21న బిగ్ బాస్ 3 ..తొలి ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది. నాగార్జున దీనికి హోస్ట్‌. ఈలోపే ఈ కేసుల సంగ‌తి తేల్చేద్దామ‌ని స్టార్ మా టీవీ భావిస్తోంది.

తెలంగాణ హైకోర్టుని ఆశ్ర‌యించారు బిగ్ బాస్ నిర్వాహకులు బంజారాహిల్స్, రాయదుర్గం పీఎస్‌లలో నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్ వేశారు.

మ‌రోవైపు, బిగ్ బాస్ 3ని నిలపాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్జం దాఖ‌లు చేశాడు నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. ఎపుడూ వార్త‌ల్లో ఉండేందుకు ప్ర‌య‌త్నించే కేతిరెడ్డి ఇలాంటి కేసులు వేస్తుంటాడు. ఆ మ‌ధ్య ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి పోటీగా తాను ల‌క్ష్మీస్ వీరగ్రంధం సినిమా తీస్తున్నట్లు హ‌డావుడి చేశాడు. చంద్ర‌బాబు అధికారంలో ఉన్నంత‌కాలం బాబుకి అనుకూలంగా హంగామా చేశాడు. ఇపుడు బాబుకి స‌వాలు విసురుతూ సీఎం జ‌గ‌న్‌ని పొగిడేస్తున్నాడు. 

ఎపుడూ కేసులు, ప్రెస్‌నోట్ల‌తో బిజీగా ఉండే కేతిరెడ్డి బిగ్‌బాస్‌పై వేసిన పిటీష‌న్‌లో ప్ర‌తి ఎపిసోడ్‌ని సెన్సార్ చేయాల‌ని కోరాడు.