శ్ర‌ద్దా క‌పూర్ కోసమే రెండో వీడియో

Birthday treat for Shraddha Kapoor from Saaho Team
Sunday, February 24, 2019 - 21:15

అప్పుడెప్పుడో బాహుబలి-2 టైమ్ లో సాహోకు సంబంధించి చిన్న టీజర్ వీడియో లాంటిది విడుదల చేశారు. మళ్లీ లాంగ్ గ్యాప్ ఇచ్చి షేడ్స్ ఆఫ్ సాహో పేరిట ప్రభాస్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. అయిదు నెల‌ల పాటు చప్పుడు చేయలేదు. ఇన్నాళ్లకు సాహో నుంచి మరో మెటీరియల్ రాబోతోంది. దానికి కార‌ణం.. శ్ర‌ద్దా క‌పూర్‌.

మార్చి 3న ఆమె పుట్టిన రోజు. బాహుబ‌లి టైమ్‌లో టీమ్‌లో ప్ర‌తి మెంబ‌ర్ బ‌ర్త్‌డేకి ఒక ఫోటోని విడుద‌ల చేశారు. ఇపుడు సాహో మేక‌ర్స్ హీరోయిన్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మరో మేకింగ్ వీడియో  ఇస్తున్నారు. దీనికి గ్లింప్స్ ఆఫ్ సాహో 2 అని పేరు కూడా పెట్టారు.

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నారు. శ్ర‌ద్దాక‌పూర్‌కిది తొలి తెలుగు చిత్రం.