కృష్ణరాజును ఏమని పిలుస్తాడో తెలుసా?

The bonding between Prabhas and Krishnam Raju
Monday, December 23, 2019 - 08:45

ప్రభాస్ కృష్ణంరాజును పెదనాన్న అంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ రియల్ లైఫ్ లో కృష్ణంరాజును ప్రభాస్ ఇలా పిలవడు. పెదనాన్న అనే సంభోదనే ఉండదు. అవును.. కాస్త ఆశ్చర్యంగా అనిపించే ఈ విషయాన్ని కృష్ణంరాజు భార్య శ్యామల వెల్లడించారు.

రియల్ లైఫ్ లో కృష్ణంరాజును ప్రభాస్.. పెద్ద బాజీ అని పిలుస్తాడట. ఇక కృష్ణంరాజు భార్య శ్యామలను కన్నమ్మా అని పిలుస్తాడట. ప్రభాస్ ఎప్పుడు ఇంటికొచ్చినా తమకు పండగలా ఉంటుందని, ఓ స్టార్ లా కాకుండా.. తమ కన్న కొడుకులా కలిసిపోతాడని చెబుతోంది కృష్ణంరాజు భార్య. తనతో, తన పిల్లలో (ప్రభాస్ చెల్లెళ్లు) ప్రభాస్ చాలా ప్రేమతో ఉంటాడని అంటున్నారు.

ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని బయటపెట్టిన శ్యామల.. కృష్ణంరాజును సంతోషంగా చూడాలనేది ప్రభాస్ లక్ష్యమని, దానికి ఏం చేయాలో చెప్పమని ప్రతిరోజూ అడుగుతుంటాడని వెల్లడించారు. ప్రభాస్ వచ్చిన రోజు తమ ఇంట్లో నాన్-వెజ్ వంటకాలు ఘుమఘుమలాడుతాయని చెబుతున్నారు.