నంద‌మూరి బాల‌కృష్ణని సీఎం చెయ్య‌ట్లేదు

Boyapati gives clarification about Balakrishna's role
Thursday, January 31, 2019 - 23:15

నంద‌మూరి బాల‌కృష్ణ సీఎం కాబోతున్నార‌ని మీడియాలోనూ, సోష‌ల్ మీడియాలోనూ వార్త‌లు హోరెత్తాయి. బాల‌య్య‌ని సీఎంని చేయ‌బోతున్న‌ది ఎవ‌రో కాదు బోయ‌పాటి శ్రీను అనీ, బోయ‌పాటి తదుప‌రి చిత్రంలో బాల‌య్య‌ది భ‌ర‌త్ అనే నేను టైప్ రోల్ అని ప్ర‌చారం మొదలైంది. అయితే ఇది పూర్తిగా త‌ప్పు అని బోయ‌పాటి క్లారిటీ ఇచ్చారు.

"గ‌తేడాది మా కాంబినేష‌న్లో మ‌ళ్లీ సినిమా తీయాల‌నుకున్నాం. ఎన్నిక‌ల‌కి ముందు విడుద‌ల‌య్యేలా ఒక పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అనుకున్నాం. కానీ అలా కుద‌ర‌లేదు. ఇపుడు మా సినిమా... ఎన్నిక‌ల త‌తంగం మొత్తం ముగిసిన త‌ర్వాతే విడుద‌ల అవుతుంది. సో.. పొలిటిక‌ల్ థీమ్‌తో మూవీ తీయ‌డం వ‌ద్ద‌నుకున్నాం,"  అని బోయ‌పాటి వివ‌ర‌ణ ఇచ్చారు. ఫిబ్ర‌వ‌రిలో లాంఛ‌నంగా సినిమాని ప్రారంభించి మార్చి, ఏప్రిల్ నెల‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ చేస్తార‌ట‌. ఐతే ఈ సినిమాలో బాల‌య్య ముఖ్య‌మంత్రిగా క‌నిపించ‌డం లేద‌ని, అలాంటి పొలిటిక‌ల్ పాత్రే కాద‌ని చెప్పాడు బోయ‌పాటి.

గ‌తంలో వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన "సింహా "త‌ర‌హాలో యాక్ష‌న్ పంథాలో సాగే మాస్ సినిమా ఉండ‌నుంది. ఎన్‌బీకే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై బాల‌య్యే ఈ సినిమాని నిర్మించనున్నారు. బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్లో ఇంత‌కుముందు వ‌చ్చిన "సింహా", "లెజెండ్‌"...రెండూ సూప‌ర్ హిట్ట‌య్యాయి.