గ్రాండ్ నెస్ తగ్గదు: బోయపాటి

Boyapati says the richness of production will continue
Sunday, April 26, 2020 - 12:00

కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీ అతలాకుతలం కానుంది. పెద్ద సినిమాలు సైతం బడ్జెట్ తగ్గించుకోవాల్సిన సీన్ ఏర్పడింది.  బోయపాటి శ్రీను బాలయ్యతో తీస్తున్న సినిమాకి పెద్ద ఇబ్బందే అని వార్తలు వచ్చాయి. తెలుగుసినిమా.కామ్ కూడా రాసింది. ఐతే, ఇదంతా ట్రాష్ అని అంటున్నారు బోయపాటి. ఈ మూవీ గ్రాండ్ నెస్ తగ్గదు అని క్లారిటీ ఇచ్చారు.

"నా సినిమా అంటే.. రిచ్ నెస్ లేకుంటే ఎలా? ఎంతలో అంతలో తీస్తాం... కానీ భారీతనం మాత్రం తగ్గదు. సినిమా అందరి అంచనాలను అందుకుంటుంది," అని మరోసారి స్పందించారు బోయపాటి. అన్ని కుదిరితే దసరా పండగకు సినిమాని రిలీజ్ చేస్తారట. బోయపాటి ధీమాకి కారణం ఏంటో మరి.

బాలకృష్ణ రీసెంట్ గా నటించిన సినిమాలు ఏవీ ఆడలేదు. కొన్నవారికి భారీగా నష్టాలు వచ్చాయి. దాంతో ఈ సినిమాకి భారీ బడ్జెట్ అవసరమా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కానీ బోయపాటి మాత్రం... తమ కాంబినేషన్ కి ఉండే క్రేజ్ వేరు అని భావిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన "లెజెండ్", "సింహ" సినిమాలు భారీ విజయం సాధించాయి.