బోయ‌పాటి లొకేష‌న్ సెంటిమెంట్‌

Boyapati's location sentiment
Friday, August 31, 2018 - 09:15

డైర‌క్ట‌ర్ బోయ‌పాటి అన‌గానే మ‌...మ‌..మాస్ అని అంటారు. మాస్‌కి న‌చ్చే ఎలిమెంట్స్‌తో సినిమాలు తీయ‌డం బోయ‌పాటి స్పెషాలిటీ. గ్రాండ్ విజువ‌ల్స్‌, ర‌క్తిక‌ట్టించే యాక్ష‌న్ ఎపిసోడ్‌లు, ఈలలు, క్లాప్స్ ప‌డేస్థాయిలో డైలాగ్‌లు ఆయన సినిమాల్లో ప‌రిపాటి. ఐతే, రీసెంట్‌గా ఆయ‌న త‌న ప్ర‌తి సినిమాలో ఒక కొత్త లొకేష‌న్‌ని చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఏ ద‌ర్శ‌కుడు అంత‌కుముందు చిత్రీక‌రించ‌ని లొకేష‌న్‌ని తాను చూపిస్తున్నాడు.

స‌రైనోడు సినిమాలో తెలుసా తెలుసా అనే పాట‌ని బొలివియాలోని సాల్ట్‌లేక్‌లో చిత్రీక‌రించాడు. అది సినిమాకి చాలా ప్ల‌స్ పాయింట్ అయింది. ఆ పాట హిట్‌కి బాగా హెల్ప్ చేసింది. ఇక జ‌య జాన‌కీ నాయ‌క‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని హంస‌ల‌దీవి ప్రాంతంలో యాక్ష‌న్ సీన్లు చిత్రీక‌రించాడు. అంత‌కుముందు ఎవ‌రూ ఈ ప్రాంతంలో సినిమా తీయ‌లేదు. దుబాయ్ ఎడారుల్లో లెజెండ్ మూవీ యాక్ష‌న్ సీన్ల‌ను తీశాడు. 

ఇపుడు మ‌రో కొత్త లొకేష‌న్‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కి చూపించాల‌నుకుంటున్నాడు. అజార్‌బైజ‌న్ దేశంలో కొన్ని కీల‌క సన్నివేశాల‌ను తీయ‌నున్నాడు ఇపుడు. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి తీస్తున్న తాజా చిత్రం సీన్లు అక్క‌డ తీయ‌నున్నారు. ది వ‌ల్డ్ ఈజ్ నాట్ ఇన‌ఫ్ వంటి ఇంగ్లీషు సినిమాల‌ను ఇక్క‌డ చిత్రీక‌రించారు. ఇలా బోయ‌పాటి ప్ర‌తి సినిమాలో ఒక కొత్త లొకేష‌న్‌ని ప‌రిచ‌యం చేయాల‌నుకునే సెంటిమెంట్ పెట్టుకున్న‌ట్లు క‌నిపిస్తోంది.