నాగార్జున హిందీ మూవీ లోగో రిలీజ్‌

Brahmastra launches its logo on Maha Shivratri at the Kumbh Mela
Tuesday, March 5, 2019 - 16:30

ర‌ణ‌భీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ జంట‌గా క‌ర‌ణ్ జోహ‌ర్‌ నిర్మిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ `బ్ర‌హ్మాస్త్ర‌`. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ధారులు. నాగార్జున ఈ సినిమాలో చాలా వెరైటీ రోల్‌లో క‌నిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ కోసం ప్ర‌స్తుతం నాగార్జున ప్ర‌యాగ‌కి వెళ్లారు.

షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా లోగోను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌యాగ కుంభ‌మేళాలో వినూత్నంగా విడుద‌ల చేశారు.

ఈ లోగో విడుద‌ల కార్య‌క్ర‌మంలో భాగంగా ర‌ణ‌భీర్ కపూర్‌, అలియా భ‌ట్‌, ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ ప్ర‌యాగ‌కు వెళ్లారు. హీరోయిన్ అలియా భ‌ట్ త‌న ఇన్‌స్టా గ్రామ్ ద్వారా లైవ్‌లో ప్రోగ్రాం వివ‌రాల‌ను తెలియ‌జేశారు. 150 డ్రోన్ కెమెరాల స‌హాయంతో బ్ర‌హ్మాస్త్ర అనే లోగోను ఆకాశంలో ఆవిష్క‌రించడం విశేషం. ఇలా డ్రోన్స్ స‌హాయంతో ఆకాశంలో లోగోను ఆవిష్క‌రించ‌డం సినిమా చరిత్ర‌లో ఇదే మొద‌టిసారి. ఇలా గ్రాండ్‌గా విడుద‌ల చేసిన బ్ర‌హ్మాస్త్ర లోగో  అక్క‌డకు వ‌చ్చిన వారంద‌రినీ ఆక‌ట్టుకుంది.

బ్ర‌హ్మాస్త్ర ఫ్రాంచైజీలో మూడు భాగాలుంటాయి. అందులో మొద‌టి భాగాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేయ‌నున్నారు