జాన్ కి బడ్జెట్లో భారీగా కోత

Budge cut for Prabhas's Jaan
Thursday, December 19, 2019 - 14:15

బాహుబలి తర్వాత ప్రభాస్ కి నేషనల్ లెవల్లో వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకొని భారీ లాభాలు చూద్దామనుకున్న యువి క్రియేషన్స్ కి పెద్ద దెబ్బ పడింది. హిందీలో ఆడింది కానీ తెలుగు, తమిళ, మలయాళ  వెర్సన్స్ నష్టాలు మిగిల్చాయి. కర్ణాటకలోనూ అంతే. ఈ మిస్ ఫైర్ తర్వాత... ప్రభాస్ అండ్ టీం మేలుకున్నారు. క్రేజ్ ని సరిగా యూజ్ చేసుకోలేకపోతున్నాం అని తెలిసొచ్చింది. అందుకే... 'జాన్' అనే కొత్త సినిమా ప్రొడక్షన్ లో వేస్టేజి తగ్గిస్తున్నారిపుడు.

'జాన్' షూటింగ్ ని అందుకే ఆపారు. విదేశాల్లో భారీగా ఖర్చు పెట్టి తీద్దామని ఇంతకుముందు వేసిన ప్లాన్ సైడ్ కెళ్లింది. మొత్తంగా సెట్స్ తో లాగించనున్నారు. అది కూడా స్టూడియోలో సెట్స్ వేయడం లేదు. అన్నపూర్ణ, రామోజీ ఫిలిం సిటీల్లో సెట్స్ వేస్తె తడిసి మోపెడు అవుతుంది. అందుకే... హైదరాబాద్ చుట్టూ పక్కల ఉన్న తమకి తెలిసిన వారి లాండ్ లలో సెట్స్ వెయ్యడం అనే ట్రెండుని ఇప్పుడు నిర్మాతలు మొదలు పెట్టారు. మొన్న సైరాకి, నిన్న సరిలేరు నీకెవ్వరు సినిమాకి సంబంధించి విజయశాంతి ఇంటి సెట్ ని ఇలాగె ప్రైవేట్ ప్లేసుల్లో క్రీస్తే చేశారు. 

'జాన్' అదే పద్దతి. ఆలా బడ్జెట్ బాగా తగ్గిపోనుంది. నిర్మాతకి భారం తగ్గుతుంది. 

రాధాకృష్ణ కుమార్ అనే దర్శకుడు (ఇంతకుముందు ఇతను గోపీచంద్ హీరోగా 'జిల్' అనే మూవీ తీశాడు) డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రేమకథ వచ్చే ఏడాది దసరాకి రిలీజ్ కానుంది. ఈ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్.