కిల్‌బిల్ పాండేని ప‌రామ‌ర్శించిన బ‌న్ని

Bunny calls on Brahmanandam
Thursday, February 7, 2019 - 15:15

ఇటీవ‌ల ముంబైలో హార్ట్ స‌ర్జ‌రీ చేయించుకొన్న బ్ర‌హ్మానందం తిరిగి త‌న ఇంటికి వ‌చ్చారు. ఆయ‌న కోలుకొని హైద‌రాబాద్ వ‌చ్చార‌ని తెలుసుకున్న హీరో అల్లు అర్జున్‌.. బ్ర‌హ్మానందం ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు.

ఆయ‌న రియ‌ల్ ఐర‌న్‌మేన్‌. గ‌ట్టి గుండె క‌లిగిన వ్య‌క్తి. న‌వ్వులు త‌ప్ప భ‌యం ఎర‌గ‌ని మ‌నిషి. మా కిల్‌బిల్ పాండే అద‌ర‌గొడుతుండ‌డం చూసి ఆనందిస్తున్నా అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. బ్ర‌హ్మీతో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేశాడు.

బ్ర‌హ్మానందంకి కొంత క‌ష్ట‌మైన హృద్రోగ స‌మ‌స్య వ‌చ్చింది. దానికి స‌ర్జ‌రీ చేయ‌గ‌లిగే వైద్యులు ఇండియాలో చాలా త‌క్కువ‌మంది ఉన్నారు. ముంబైలో ఉన్న‌ఫేమ‌స్ డాక్ట‌ర్ ర‌మాకాంత్ మీ స‌మ‌స్య‌కి స‌రైన వైద్యుడు అని  హైద‌రాబాద్‌లోని డాక్ట‌ర్స్ సూచించ‌డంతో అక్క‌డికి వెళ్లి స‌ర్జ‌రీ చేయించుకున్నారు. ఇపుడు ఆయ‌న పూర్తిగా కోలుకున్నారు.