కొత్త ఆఫీస్ తీసుకున్న అల్లు అర్జున్‌

Bunny moves into new office
Tuesday, September 25, 2018 - 10:45

అల్లు అర్జున్ త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఒక ఆఫీస్ ఉండాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నాడు. ఇన్నాళ్ల‌కి అది కుదిరింది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న తండ్రి గీతాఆర్ట్స్ ఆఫీస్‌లో మొద‌టి ఫ్లోర్‌లో ప్రత్యేకంగా గ‌దిని తీసుకొని త‌న ఆఫీస్‌గా వాడుకుంటూ వ‌స్తున్నాడు. ఐతే ఇపుడు గీతా ఆర్ట్స్ వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తుండ‌డంతో ఆ ఆఫీస్ స‌రిపోవ‌డం లేదు. సో..త‌న‌ని క‌ల‌వాల‌ని వ‌చ్చే నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, అలాగే తన టీమ్ ఉండేందుకు ప్ర‌త్యేకంగా ఆఫీస్ తీసుకున్నాడు. 

ఇటీవ‌లే జూబ్లీహిల్స్‌లోని త‌ కొత్త ఆఫీస్‌లోకి మూవ్ అయ్యార‌ట‌.

మ‌రోవైపు, అల్లు అర్జున్ త‌న తదుప‌రి చిత్రాన్ని ఇంకా అనౌన్స్ చేయ‌లేదు. విక్ర‌మ్‌కుమార్‌తో ఒక మూవీ ఓకే చేసినా...అది ఎపుడు మొద‌ల‌వుతుందో చెప్ప‌లేం. అలాగే త్రివిక్ర‌మ్‌తో కూడా కొత్త సినిమా ఉంటుంద‌ని టాక్‌. నా పేరు సూర్య అప‌జయం పాలు అయిన త‌ర్వాత బ‌న్ని..ఇక కొంత స్లో అవ‌డం మంచిది అని అనుకున్నాడ‌ట‌. భారీ హిట్‌తో పాటు న‌టుడిగానూ మంచి పేరువ‌చ్చే సినిమాలు కావాల‌నుకుంటున్నాడు. అందుకే కొత్త సినిమా ప్ర‌క‌ట‌న విష‌యంలో తొంద‌ర‌ప‌డ‌డం లేదు.