బన్నీ వాసూ ... ఇదేమి వివరణ బాసూ

Bunny Vaas's explanation lacks clarity
Thursday, September 5, 2019 - 22:15

నిర్మాత బన్నీ వాసుపై ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఇటీవల కొన్ని ఆరోపణలు చేసింది. ఇంతకుముందు ఆమె ఇతరులపై చేసిన నిరాధార ఆరోపణల కారణంగా ఆమె ఇష్యూని మెయిన్ స్ట్రీమ్ అంతగా సీరియస్ పట్టించుకోలేదు. కానీ సోషల్ మీడియా, వెబ్ మీడియా మాత్రం పూర్తిగా కవర్ చేసింది. దాంతో ఈ రోజు గీతా అర్త్స్ సంస్థ సోషల్ మీడియా హేండిల్ ద్వారా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. దాని సారాంశం ఏంటంటే ... సునీత అనే ఆ జూనియర్ ఆర్టిస్ట్ తనకి వాళ్ళ ప్రొడక్షన్ సినిమాల్లో ఒక రోలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆఫీస్ గేట్ వద్ద గతంలో హల్చల్ చేసిందట. ఈ మేటర్ లో ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు చేశారట. ఈ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళు పీ.ఆర్ టీంని సంప్రతించాలట. 

అంతా బానే ఉంది కానీ ఆ జూనియర్ ఆర్టిస్ట్ ...కేవలం ఒక్క గీత ఆర్ట్స్ ఆఫీస్ వద్దే ఎందుకు రభస చేస్తోంది? హైదరాబాద్ లో ఎన్నో ప్రొడక్షన్ హౌసులు ఉండగా ..ఎందరో నిర్మాతలు ఉండగా ఒక్క బన్నీ వాసుపైనే ఆమె ఎందుకు ఒత్తిడి చేస్తోంది? వీటికి సమాధానం లేదు. ఇంకా వివరణ కావాలంటే వాళ్ళ పీఆర్వోలని అడగాలంటా? ఏంటో!